England vs India: తొలిటెస్టు సమరానికి సై….

బుధవారం నుంచి జరిగే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు భారత్-ఇంగ్లండ్ సిద్దమయ్యాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో ఈ సిరీస్ భాగం కావడంతో… ఇరుజట్లు హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. గాయం కారణంగా మయాంక్ అగర్వాల్ జట్టుకు దూరం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ … కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపే అవకాశముంది.బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే టీమిండియాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కోవిడ్ వైరస్ టెన్షన్, మరోవైపు వైపు ఆటగాళ్ల గాయాలు.. జట్టును వేధిస్తున్నాయి. డబ్లూటీసీ ఫైనల్ తర్వాత ఓపెనర్ శుభ్ మన్ గిల్ .. గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. కౌంటీల్లో ఆడుతూ గాయాలపాలైన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆవేశ్ ఖాన్.. జట్టుకు అందుబాటులో లేరు. లంక సిరీస్ నుంచి ఇంగ్లండ్ చేసిన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషాలు కోవిడ్ క్వారంటైన్ లో ఉన్నారు. వారు మూడో టెస్టునాటికి అందుబాటులోకి వస్తారు. వీటన్నింటితో పాటు ఓపెనర్ మయాంక్ గాయపడడం.. పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.

అదీగాక.. ఇండియాకు ,.. ఆతిథ్య ఇంగ్లండ్ లో పూర్ రికార్డ్ ఉంది. మొత్త 61 మ్యాచులు ఆడిన ఇండియా 34 గేముల్లో ఓటమి చవిచూసింది. కేవలం ఏడింటిలో గెలిచిన టీమిండియా..21 మ్యాచులు డ్రా చేసుకుంది. దీనికితోడు ఆతిథ్య జట్టు… పేస్ , స్వింగ్ కు అనుకూలమైన పిచ్ తయారీలో ఉన్నట్లు ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ సంకేతాలిచ్చాడు. దీంతో ఈ సిరీస్ కాస్త ఇంగ్లండ్ పేసర్లు.. ఇండియన్ బ్యాట్స్ మన్ గా మారనుంది.

Related Articles